🪔 తెనాలి కథలు · Tenali Tales

Episode T07

గాలిలో తేలే రాజభవనం

The Floating Palace in the Air — Where Does a Dream End and Reality Begin?

🪔
విజయనగర రాజ్యం
కృష్ణదేవరాయల సభ
తెనాలి రామకృష్ణ
📖 చదవడానికి సమయం: ~7 నిమిషాలు / ~7 min read 👶 వయసు: 8+ 📂 Series: తెనాలి కథలు ✍️ By: RayalSabha 📅 Published: July 2026
🪔 కథ గురించి · About this Story

ఈ కథలో మహారాజుకు కలలో ఒక అద్భుతమైన గాలిలో తేలే రాజభవనం కనిపిస్తుంది. దాన్ని నిజమని నమ్మిన రాజు, అదే భవనాన్ని నిర్మించమని రాజ్యం మొత్తానికి కఠినమైన ఆజ్ఞ జారీ చేస్తాడు — కట్టలేకపోతే శిక్ష తప్పదని హెచ్చరిస్తాడు. రాజ్యం మొత్తం భయంతో వణికిపోతున్న సమయంలో, తెనాలి రామకృష్ణుడు ఒక ముసలివాడి వేషంలో సభలోకి వచ్చి, రాజు మీదే ఒక వింత ఆరోపణ చేస్తాడు — కలలో జరిగిన దొంగతనానికి నిజ జీవితంలో న్యాయం అడుగుతూ! కల, వాస్తవం మధ్య తేడాను రాజుకే స్వయంగా తెలియజేసిన తెనాలి తెలివి ఈ కథలో మీకు కనిపిస్తుంది.

In this story, a King dreams of a magnificent palace floating in the air and, believing the dream to be real, orders his entire kingdom to build it — under threat of harsh punishment if they fail. As fear grips the land, Tenali Ramakrishna arrives at court disguised as an old man and levels a strange accusation at the King himself — demanding real justice for a theft that happened only in a dream. Through this clever confrontation, Tenali teaches the King — and every reader — where a dream must end and reality must begin.

01

కల

The Dream

విజయనగరంలో ఒక్కసారిగా ప్రకటన వెలువడింది... గాలిలో తేలే రాజభవనం కట్టినవారికి లక్ష బంగారు నాణేలు! కానీ కట్టలేకపోతే... శిక్ష తప్పదు! రాజు ఇంత వింత ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు?

Suddenly, an announcement rang out across Vijayanagara... a hundred thousand gold coins for whoever builds a palace that floats in the air! But if they fail... punishment is certain! Why did the King give such a strange order?

విజయనగర రాజసభ... ఆ రోజు మహారాజు ఎంతో ఉత్సాహంగా సభలోకి అడుగుపెట్టారు. మంత్రి ఆశ్చర్యంగా అడిగాడు.

The royal court of Vijayanagara... that day, the Emperor stepped into the hall brimming with excitement. The Minister asked, surprised.

🎖️ మంత్రి
మహారాజా... ఈరోజు ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు.
"Your Majesty... you seem so joyful today."
👑 రాజు
అవును మంత్రి... నిన్న రాత్రి నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. మేఘాల మధ్య... గాలిలో తేలుతూ ఉన్న ఒక అద్భుతమైన రాజభవనం కనిపించింది. బంగారు గోడలు... వజ్రాల స్తంభాలు... నేలను తాకని మెట్లు... ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందే కనిపిస్తోంది. నాకు అలాంటి రాజభవనం కావాలి.
"Yes, Minister... last night I had a wondrous dream. Amid the clouds, I saw a magnificent palace floating in the air. Golden walls... diamond pillars... steps that never touched the ground... that vision still floats before my eyes. I want a palace exactly like that."
మేఘాల మధ్య గాలిలో తేలుతున్న బంగారు రాజభవనం, కల దృశ్యం

సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఒక ప్రముఖ శిల్పి వినయంగా ముందుకు వచ్చాడు.

A sudden silence fell over the court. A renowned sculptor stepped forward humbly.

02

శిల్పి & రాజాజ్ఞ

The Sculptor & the Decree
🛠️ శిల్పి
మహారాజా... ఎత్తైన రాజభవనం కట్టగలం. కొండపై కూడా నిర్మించగలం. నీటి మధ్యలో కూడా నిర్మించగలం. కానీ... గాలిలో తేలే రాజభవనం నిర్మించడం మాత్రం అసాధ్యం.
"Your Majesty... we can build a towering palace. We can build one atop a mountain. We can even build one in the middle of water. But... building a palace that floats in the air is impossible."
రాజసభలో వినయంగా నిలబడిన శిల్పి, రాజుకు జవాబిస్తున్న దృశ్యం

రాజు గంభీరంగా లేచాడు.

The King rose gravely.

👑 రాజు
ప్రయత్నించకముందే 'అసాధ్యం' అని చెప్పడం నాకు నచ్చదు. ఈరోజు అసాధ్యంగా అనిపించేది... రేపు సాధ్యం కాకూడదని ఎవరు చెప్పారు? వెళ్లండి... నా కలలో చూసిన ఆ రాజభవనాన్ని నిర్మించండి. ఆ భవనం నిర్మించిన వారికి... లక్ష బంగారు నాణేలు బహుమతి! కట్టలేకపోతే... కఠిన శిక్ష తప్పదు.
"I dislike calling something 'impossible' before even trying. Who says what seems impossible today cannot become possible tomorrow? Go... build that palace exactly as I saw it in my dream. Whoever builds it shall receive a hundred thousand gold coins! If you fail... harsh punishment is certain."
03

రాజ్యం విఫలం

The Kingdom's Failed Attempts

ఆ రాజాజ్ఞతో... రాజ్యం మొత్తం భయపడిపోయింది. శిల్పులు... వాస్తు నిపుణులు... దేశ విదేశాల నుంచి వచ్చిన కళాకారులు... అందరూ ప్రయత్నించారు. కానీ... ఎవ్వరూ గాలిలో తేలే రాజభవనాన్ని నిర్మించలేకపోయారు.

With that royal decree, the entire kingdom was gripped by fear. Sculptors, architects, artists from near and far — all of them tried. But no one could build a palace that floats in the air.

విఫలమైన నిర్మాణ యార్డు, పడిపోయిన ఆధారాలు, భయంతో నిండిన రాజ్యం

ఎవ్వరూ బహుమతి గురించి మాట్లాడలేదు. అందరూ... శిక్ష గురించే మాట్లాడుకున్నారు. ఇదంతా గమనించిన తెనాలి రామకృష్ణుడు చిరునవ్వు నవ్వుకున్నాడు.

No one spoke of the reward anymore — everyone spoke only of the punishment. Watching all this, Tenali Ramakrishna smiled quietly to himself.

🪶 తెనాలి (మనసులో)
మహారాజు తప్పు చేయడం లేదు... కానీ... కలను నిజమని నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయనకు బోధ కాదు... అనుభవం కావాలి.
"The King isn't wrong... but he has begun believing his dream is real. What he needs now is not a lecture... but an experience."
04

ముసలివాడి ఆరోపణ

The Old Man's Accusation

మరుసటి రోజు... రాజసభ జరుగుతోంది. అప్పుడే... ఒక ముసలివాడు... చిరిగిన బట్టలతో... చేతిలో కర్రతో... ఏడుస్తూ సభలోకి వచ్చాడు.

The next day, the royal court was in session. Just then, an old man — in torn clothes, with a walking stick in hand — entered the court, weeping.

చిరిగిన బట్టలతో, కర్రతో ఏడుస్తూ సభలోకి వచ్చిన ముసలివాడు
🧓 ముసలివాడు
మహారాజా... నాకు న్యాయం చేయండి.
"Your Majesty... grant me justice."
👑 రాజు
ఏమైంది తాతా?
"What happened, grandfather?"
🧓 ముసలివాడు
మహారాజా... నా జీవితాంతం కూడబెట్టుకున్న ధనం అంతా దొంగిలించబడింది.
"Your Majesty... all the wealth I saved my entire life has been stolen."
👑 రాజు
తాతా... ఆ దొంగ ఎవరో నీకు తెలుసా?
"Grandfather... do you know who the thief is?"
🧓 ముసలివాడు
తెలుసు మహారాజా. ఆ వ్యక్తి... ఈ సభలోనే ఉన్నాడు.
"I do, Your Majesty. That person... is right here in this court."

సభలో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి.

Whispers immediately spread through the hall.

👑 రాజు
అయితే ఆలస్యం ఎందుకు? ఆ వ్యక్తి ఎవరో చెప్పు.
"Then why delay? Tell us who that person is."

ముసలివాడు కాసేపు మౌనంగా నిలబడ్డాడు.

The old man stood silent for a moment.

🧓 ముసలివాడు
చెబితే... నిజంగానే శిక్షిస్తారా మహారాజా?
"If I tell you... will you truly punish them, Your Majesty?"

రాజు గర్వంగా సింహాసనం మీద నుంచి లేచాడు.

The King rose proudly from his throne.

👑 రాజు
ఇది రాజు మాట! ఈ రాజ్యంలో న్యాయం ముందు అందరూ సమానమే. ఆ వ్యక్తి ఎవరైనా సరే... శిక్ష తప్పదు.
"This is the King's word! In this kingdom, all are equal before justice. Whoever that person may be... punishment is certain."

ముసలివాడు నెమ్మదిగా తన చేతిని పైకెత్తి... నేరుగా రాజువైపు చూపిస్తూ...

The old man slowly raised his hand... pointing directly at the King...

🧓 ముసలివాడు
అయితే... ఆ దొంగ... సింహాసనం మీద కూర్చున్న... మీరే మహారాజా!
"Then... that thief... is you, Your Majesty, seated upon the throne!"
05

వేషం తొలగింపు

The Unmasking

సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. మంత్రి కోపంతో లేచాడు.

The entire court fell silent at once. The Minister rose in anger.

🎖️ మంత్రి
ఏం మాట్లాడుతున్నావో తెలుసా? మహారాజునే దొంగ అంటావా?
"Do you know what you're saying? You call the Emperor himself a thief?"

భటులు ముందుకు దూసుకొచ్చారు. కానీ... రాజు చేతితో వారిని ఆపాడు.

The guards rushed forward. But the King stopped them with a raised hand.

👑 రాజు
ఆగండి. ముందు ఇతని మాట వినాలి. నేను నీ ధనం ఎప్పుడు దొంగిలించాను?
"Wait. Let us hear him first. When did I steal your wealth?"
🧓 ముసలివాడు
నిన్న రాత్రి మహారాజా.
"Last night, Your Majesty."

రాజు ఆశ్చర్యపోయాడు.

The King was taken aback.

👑 రాజు
నిన్న రాత్రా? నేను రాజభవనం దాటలేదే.
"Last night? I never even left the palace."

ముసలివాడు ప్రశాంతంగా అన్నాడు.

The old man said calmly.

🧓 ముసలివాడు
...నా కలలో.
"...in my dream."

సభ మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది. రాజు కూడా నవ్వుతూ అన్నాడు.

The entire court burst into laughter. The King, laughing too, said.

👑 రాజు
తాతా... నువ్వూ భలే వాడివే! కలలో జరిగిన దొంగతనానికి... నిజ జీవితంలో న్యాయం అడుగుతున్నావా?
"Grandfather... you are quite something! You seek real justice for a theft that happened in a dream?"
🧓 ముసలివాడు
మహారాజా... మీకు కలలో కనిపించిన రాజభవనాన్ని నిజంగా కట్టమని మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా? అలాంటప్పుడు... కలలో జరిగిన నా దొంగతనం గురించి అడగడం తప్పా, మహారాజా?
"Your Majesty... didn't you order a real palace to be built, from something you merely saw in a dream? If so... is it wrong of me to seek justice for a theft that happened in a dream too?"

రాజు ముఖంలో నవ్వు మాయమైంది. కోపంగా అన్నాడు.

The smile vanished from the King's face. He spoke angrily.

👑 రాజు (కోపంగా)
ఎవరు తాతా నువ్వు... నన్నే ప్రశ్నిస్తున్నావా?
"Who are you, old man... to question me?"

ముసలివాడు మాత్రం బెదరలేదు. నెమ్మదిగా తన శాలువాను తీసేశాడు — లోపల రుద్రాక్ష మాల, జందెం కనిపించాయి. తర్వాత నకిలీ జుట్టు, గడ్డం తీసేశాడు. సభ మొత్తం ఆశ్చర్యంతో లేచి నిలబడింది.

But the old man did not flinch. He slowly removed his shawl, revealing a rudraksha garland and sacred thread beneath. Then he peeled away the false hair and beard. The entire court rose in astonishment.

వేషం తొలగించి నిజ రూపంలో బయటపడిన తెనాలి రామకృష్ణుడు
👑 రాజు (ఆశ్చర్యంగా, కానీ అదుపులో ఉంటూ)
తెనాలి!!! నువ్వా!!!
"Tenali!!! It's you!!!"
06

తెనాలి వివరణ

Tenali's Lesson

తెనాలి నమస్కరించి, వినయంగా అన్నాడు.

Tenali folded his hands and spoke humbly.

రాజసభలో సింహాసనంపై కూర్చుని తెనాలి మాటలు వింటున్న రాజు
🪶 తెనాలి
క్షమించండి మహారాజా... మీరు వేసిన ఆజ్ఞతో ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. అందుకనే ఇంత సాహసానికి ఒడికట్టాను. ప్రయత్నించకముందే 'అసాధ్యం' అనకూడదు... అది నిజమే మహారాజా. కానీ... ప్రకృతికి, ధర్మానికి విరుద్ధమైన పనిని ప్రజలపై బలవంతం చేయడం సబబు కాదు మహారాజా!!
"Forgive me, Your Majesty... the decree you issued has left the people terrified. That is why I dared to take such a risk. One must not call something 'impossible' before trying — that much is true, Your Majesty. But forcing the people to attempt what defies nature and dharma itself is not right, Your Majesty!!"
07

ముగింపు — కానుక

The Concession & the Gift

రాజు కొన్ని క్షణాలు మౌనంగా ఆలోచించాడు.

The King thought silently for a few moments.

👑 రాజు (కొద్దిగా నవ్వుతూ)
చివరికి... నీ రాజు మీదే నువ్వు గెలిచావా తెనాలి?
"So in the end... you've outwitted your own King, Tenali?"
👑 రాజు (గంభీరంగా)
ఈ క్షణం నుంచి... గాలిలో తేలే రాజభవనం నిర్మించాలనే నా ఆజ్ఞను రద్దు చేస్తున్నాను.
"From this moment... I revoke my decree to build a palace that floats in the air."
సింహాసనంపై గంభీరంగా కూర్చున్న రాజు, ఆజ్ఞను రద్దు చేస్తున్న దృశ్యం
👑 రాజు (కొనసాగిస్తూ)
నీ తెలివితో మమ్మల్ని మేల్కొల్పావు తెనాలి... అందుకే... నీ కలలో నేను దొంగిలించిన నగదును ఇప్పుడు నిజంగా నీకు కానుకగా ఇస్తున్నాను.
"Your wit has awakened us, Tenali... and so, the wealth I 'stole' in your dream, I now give to you truly, as a gift."

(రాజు ఒక చిన్న ముద్రించిన సంచిని తెనాలికి కానుకగా ఇస్తాడు — లోపల ఏముందో చూపించడు.) తెనాలి రెండు చేతులతో వినయంగా కానుకను స్వీకరించాడు.

(The King hands Tenali a small sealed pouch — its contents unrevealed.) Tenali received the gift humbly with both hands.

రాజసభ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

The entire court erupted in applause.

🪔 నీతి — Moral of the Story

కలలు గొప్పవే…
కానీ కలలను వాస్తవమని భావించి ప్రజలపై బలవంతం చేయకూడదు.

Dreams are precious — but one must never mistake a dream for reality and force it upon others.

🌿 జీవిత పాఠం · Life Lesson

రాజు తప్పు కేవలం కల చూడటం కాదు — ఆ కలను ప్రశ్నించకుండా వాస్తవంగా భావించడమే అసలు సమస్య. మనం మన కలలను, ఆకాంక్షలను గౌరవించాలి — కానీ వాటిని ఇతరులపై బలవంతంగా రుద్దకూడదు. తెలివైన ఒక్క ప్రశ్న, పెద్ద పెద్ద ఆజ్ఞల కన్నా బలంగా నిజాన్ని బయటపెడుతుంది.

The King's mistake wasn't dreaming — it was mistaking the dream for reality without questioning it. We must honor our own dreams and ambitions, but never force them upon others as absolute truth. One clever question can reveal the truth more powerfully than any grand decree.

❓ తరచుగా అడిగే ప్రశ్నలు · FAQ
గాలిలో తేలే రాజభవనం కథ నీతి ఏమిటి?
What is the moral of this story?
+

కలలు గొప్పవే, కానీ కలలను వాస్తవమని భావించి ప్రజలపై బలవంతం చేయకూడదు.

Dreams are precious, but one must never mistake a dream for reality and force it upon others.

ఈ కథలో రాజు ఎందుకు ఆ ఆజ్ఞ ఇచ్చాడు?
Why did the King issue that decree?
+

రాజుకు కలలో ఒక అద్భుతమైన గాలిలో తేలే రాజభవనం కనిపించింది. దాన్ని నిజం అని నమ్మి, అలాంటి భవనం నిర్మించమని ఆజ్ఞ ఇచ్చాడు.

The King dreamed of a magnificent floating palace and, believing it to be real, ordered it to be built.

తెనాలి రామకృష్ణ రాజుకు ఎలా గుణపాఠం చెప్పాడు?
How did Tenali teach the King a lesson?
+

తెనాలి ముసలివాడి వేషంలో సభలోకి వచ్చి, తన కలలో రాజే తన సొమ్మును దొంగిలించాడని ఆరోపించాడు — కలలో జరిగిన దానికి నిజ జీవితంలో న్యాయం అడగడం ఎంత అసంబద్ధమో రాజుకే స్వయంగా అనుభవంలోకి తెచ్చాడు.

Tenali entered disguised as an old man and accused the King of stealing his wealth — in a dream — making the King experience firsthand how absurd it is to demand real justice for something that happened only in a dream.

ఈ కథ పిల్లలకు తగినదేనా?
Is this story suitable for children?
+

అవును, 8+ వయసు పిల్లలకు ఈ కథ చాలా అర్థమవుతుంది మరియు తెలివైన ఆలోచనను ప్రోత్సహిస్తుంది.

Yes, this story is easily understood by children 8+ and encourages clever, independent thinking.

ఈ కథలో ఏ జీవిత పాఠం ఉంది?
What life lesson does this story teach?
+

కలలను, ఆకాంక్షలను గౌరవించాలి — కానీ వాటిని ఇతరులపై బలవంతంగా రుద్దకూడదు. నిజం, ధర్మం ఎప్పుడూ కలకన్నా ముఖ్యమైనవి.

Honor your dreams and ambitions, but never force them on others. Truth and dharma always matter more than a dream.

తెనాలి రామకృష్ణ కథలు — RayalSabha · @Rayalsabha చానెల్ Subscribe చేయండి

← T06: చిత్రకారుడి అహంకారం T08: వికటకవి బిరుదు →
🪔RayalSabha · తెనాలి కథలు

ఇంకా 33 తెనాలి కథలు వస్తున్నాయి!

Subscribe చేయండి — ఒక్క కథ కూడా miss అవ్వకండి.